విప్రోలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 2025 – 12వ తరగతి అర్హతతో అవకాశం!|Wipro Customer Care Executive Recruitment 2025

మీరు 12వ తరగతి పాసై మరియు మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి పెద్దగా అనుభవం లేకపోయినా ఓ మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటే, మీకు విప్రో కంపెనీ నుండి ఒక ఛాన్స్. ప్రముఖ ఐటీ కంపెనీ అయిన విప్రో ఇప్పుడు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగానికి అర్హత ఏమిటి? ఎక్కడ పనిచేయాలి? ఎంత జీతం? అన్నీ వివరంగా తెలుసుకుందాం. ఈ అవకాశాన్ని మిస్ చేయకండి!

ముఖ్యమైన ఉద్యోగ సమాచారం

అంశంవివరాలు
ఉద్యోగం పేరుకస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్
సంస్థ పేరువిప్రో (Wipro)
ఉద్యోగం రకంఫుల్ టైమ్, ఇన్ఆఫీస్
పని దినాలువారానికి 6 రోజులు
పని ప్రదేశాలుబెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, నోయిడా, ముంబై, కొచ్చి, పుణే, గుర్గావ్, నవీ ముంబై
జీతంసంవత్సరానికి ₹2,70,000 నుండి ₹3,50,000 వరకు
వయస్సు పరిమితి18 నుంచి 30 సంవత్సరాల మధ్య
అర్హతకనీసం 12వ తరగతి పాస్

అభ్యర్థుల బాధ్యతలు

  • కస్టమర్ ఫిర్యాదులను వినడం, పరిష్కరించడం
  • కంపెనీ పెట్టిన అమ్మకపు లక్ష్యాలను చేరడం
  • కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలు అందించడం
  • టీమ్‌తో కలసి సమర్థవంతంగా పని చేయడం
  • కంపెనీ నిబంధనలు పాటించడం

అర్హతలు మరియు స్కిల్స్

అర్హత / స్కిల్వివరాలు
విద్యకనీసం 12వ తరగతి పాస్
వయస్సు18 నుండి 30 సంవత్సరాల మధ్య
భాషా నైపుణ్యంఇంగ్లీష్ + ఒక ప్రాంతీయ భాష (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం)
అనుభవంకస్టమర్ సర్వీస్ లేదా సేల్స్ అనుభవం ఉంటే మంచిది
కంప్యూటర్ స్కిల్స్బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం, ఎక్సెల్ పరిజ్ఞానం

శిక్షణ మరియు ప్రయోజనాలు

  • ఉద్యోగంలోకి చేరిన తర్వాత పూర్తి స్థాయిలో శిక్షణ
  • ప్రదర్శన ఆధారంగా ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్)
  • కంపెనీ లోపలే ఉద్యోగ పురోగతికి అవకాశాలు

ఇంటర్వ్యూ తేదీలు

ఇంటర్వ్యూ రౌండ్ప్రారంభ తేదీముగింపు తేదీ
మొదటి రౌండ్23 నవంబర్ 202430 సెప్టెంబర్ 2025
రెండవ రౌండ్26 నవంబర్ 202430 సెప్టెంబర్ 2025

👉Wipro Customer Care Executive Recruitment 2025 Apply Link

విప్రో గురించి

Wipro Limited భారతదేశానికి చెందిన బహుళజాతి ఐటీ సంస్థ. ఇది కన్సల్టింగ్, డిజైన్, ఇంజనీరింగ్, డిజిటల్ సేవలలో నిపుణత కలిగిన సంస్థ. ప్రస్తుతం Wipro సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నూతన మార్గాలు అన్వేషిస్తోంది.

అప్లికేషన్ ఫీజు

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఎవరికి ఫీజు చెల్లించే అవసరం లేదు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. Wipro Customer Care Executive ఉద్యోగానికి అర్హత ఏమిటి?
అభ్యర్థులు కనీసం 12వ తరగతి పాస్ అయి ఉండాలి. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ఈ ఉద్యోగానికి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఉందా?
లేదు, ఇది పూర్తి సమయపు ఇన్ఆఫీస్ ఉద్యోగం.

3. జీతం ఎంత ఇవ్వబడుతుంది?
జీతం సంవత్సరానికి ₹2,70,000 నుంచి ₹3,50,000 వరకు ఉంటుంది.

4. ఎక్కడ ఎక్కడ పని చేసే అవకాశం ఉంటుంది?
బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, నోయిడా, గుర్గావ్, నవీ ముంబై, కొచ్చి, పుణే నగరాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

5. శిక్షణ ఇచ్చారా?
అవును, ఉద్యోగంలో చేరిన తర్వాత పూర్తి స్థాయిలో శిక్షణ అందించబడుతుంది.

ఇలాంటి జాబ్ నోటిఫికెషన్స్ మీకు రోజు కావాలంటే, మా వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా సందర్శించండి.

Leave a Comment