Telangana Government Contract/Outsourcing Jobs 2025|10వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత

హాయ్ ఫ్రెండ్స్!

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ కొలువులు పడ్డాయి తెలుసా? అదీ కూడా మన తెలంగాణ సర్కార్ ఆరోగ్య శాఖలో! జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఈ ఉద్యోగాల భర్తీకి పిలుపునిచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా పోస్టులు భర్తీ చేయబోతున్నారు.

ఒక మంచి విషయం ఏంటంటే, ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు లేదా అవుట్‍సోర్సింగ్ పద్ధతిలో అయినా సరే, మనలాంటి యువతీయువకులకు ఒక మంచి అవకాశం. మీలో ఎవరికైనా ఆసక్తి ఉండి, ఆ ఉద్యోగానికి తగ్గ అర్హతలు ఉంటే, తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.

ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏమేం కావాలో అన్నీ చాలా క్లియర్ గా కింద ఇచ్చాను. ఒకసారి చదివి మీ అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. మీ భవిష్యత్తుకు ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ కావచ్చు! ఆల్ ది బెస్ట్!

ఏయే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి?

మొత్తం ఖాళీలు: 117

వరుస సంఖ్యఉద్యోగం పేరుఎన్ని ఖాళీలుఅర్హతలు / అనుభవం
1పీడియాట్రిషన్ (పిల్లల డాక్టర్)1MBBS + MD (పీడియాట్రిక్స్) లేదా DCH, మెడికల్ కౌన్సిల్‌లో పేరు ఉండాలి.
2స్టాఫ్ నర్స్ (B.Sc/GNM)53B.Sc (నర్సింగ్) లేదా GNM చదివి ఉండాలి, TS నర్సింగ్ కౌన్సిల్‌లో పేరు ఉండాలి.
3స్టాఫ్ నర్స్ (M.Sc నర్సింగ్)3M.Sc (నర్సింగ్) చదివి ఉండాలి, TS నర్సింగ్ కౌన్సిల్‌లో పేరు ఉండాలి.
4MLHP17MBBS/BAMS/B.Sc(నర్సింగ్)/GNM తో పాటు CPCH కోర్సు పూర్తి చేసి ఉండాలి.
5మెడికల్ ఆఫీసర్స్ (MBBS)2MBBS చదివి ఉండాలి, TS మెడికల్ కౌన్సిల్‌లో పేరు ఉండాలి.
6జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్1MBA/PG డిప్లొమాతో పాటు 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
7సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్1డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలి మరియు బైక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
8TBHV1సైన్స్ డిగ్రీ లేదా MPW అనుభవం లేదా హెచ్చడుకు సంబంధించిన కోర్సులు చేసి ఉండాలి.
9ఫార్మసిస్టులు2ఇంటర్ తో పాటు D.Pharm/B.Pharm చదివి ఉండాలి మరియు ఫార్మసీ కౌన్సిల్‌లో పేరు ఉండాలి.
10ఫిజిషియన్1MD (జనరల్ మెడిసిన్) తో పాటు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
11DEIC మేనేజర్1MDRA/MBA/MPH/BPT/BOT తో పాటు అనుభవం ఉండాలి.
12డెంటల్ టెక్నీషియన్1SSC తో పాటు డిప్లొమా (డెంటల్ టెక్నీషియన్) చేసి ఉండాలి, పారామెడికల్ బోర్డులో పేరు ఉండాలి.
13మెడికల్ ఆఫీసర్ (పురుషుడు) RBSK1MBBS / BAMS / BHMS / BUMS / BNYS చదివి ఉండాలి.
14మెడికల్ ఆఫీసర్ (స్త్రీ) RBSK1పైన చెప్పిన అర్హత ఉండాలి.
15బయో కెమిస్ట్1MD (బయో కెమిస్ట్రీ) చదివి ఉండాలి.
16సపోర్టింగ్ సిబ్బంది1010వ తరగతి పాసై ఉండాలి.
17కాంటింజెంట్ వర్కర్75వ తరగతి పాసై ఉండాలి.
18డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)1ఏదైనా డిగ్రీతో పాటు PGDCA చేసి ఉండాలి మరియు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
19ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్1డిప్లొమా (ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్) చేసి ఉండాలి, TG పారామెడికల్ బోర్డులో పేరు ఉండాలి.
20అనస్థటిస్ట్1MD (అనస్థీషియా) చదివి ఉండాలి.
21రేడియాలజీ టెక్నీషియన్1డిప్లొమా/B.Sc (రేడియోగ్రఫీ)/DMIT తో పాటు 2 సంవత్సరాల CT అనుభవం ఉండాలి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? (అర్హతలు)

  • వయస్సు: కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 46 సంవత్సరాలు మించకూడదు (01.07.2024 నాటికి).
  • వయస్సులో సడలింపు:
    • SC, ST, BC, EWS వారికి: 5 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది.
    • Ex-Servicemen వారికి: 3 సంవత్సరాలు మరియు వారు పనిచేసిన కాలం (ఇది మెడికల్ ఆఫీసర్ పోస్టులకు మాత్రమే).
    • NCC (ఇన్‌స్ట్రక్టర్) వారికి: 3 సంవత్సరాలు మరియు వారు పనిచేసిన కాలం.
    • దివ్యాంగులకు: 10 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది.

👉Telangana Government Contract/Outsourcing Jobs 2025 Notification PDF

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోండి:
    👉 https://sangareddy.telangana.gov.in
  • ఫారం నింపిన తర్వాత, దానిని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఇవ్వవచ్చు లేదా పోస్ట్ ద్వారా పంపవచ్చు.
  • చివరి తేదీ దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను తీసుకోరు.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి,
సంగారెడ్డి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం,
India.

దరఖాస్తును ప్రత్యక్షంగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పై చిరునామాకు పంపించాలి.

ముఖ్యమైన తేదీలు

విషయంతేదీ
నోటిఫికేషన్ విడుదల29-04-2025
దరఖాస్తులు తీసుకోవడం మొదలు29-04-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ03-05-2025

ఏమేం సర్టిఫికెట్లు కావాలి? (అన్ని జిరాక్స్ కాపీలపై మీ సంతకం ఉండాలి)

  • SSC / పుట్టిన తేది సర్టిఫికెట్
  • ఇంటర్మీడియట్ / 10+2 సర్టిఫికెట్
  • మీ చదువుకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్
  • మార్కుల లిస్టులు (అన్ని సంవత్సరాలవి)
  • రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సంబంధిత కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నట్లు రుజువు)
  • మీ కులం / EWS (ఆర్థికంగా వెనుకబడినవారు) / Ex-Servicemen / PH (దివ్యాంగులు) / NCC సర్టిఫికెట్లు
  • 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు మీరు చదివినట్లు సర్టిఫికెట్ లేదా మీరు అక్కడే ఉంటున్నట్లు రెసిడెన్స్ సర్టిఫికెట్
  • PH అభ్యర్థులైతే PH సర్టిఫికెట్
  • మీ ఫోటో (అప్లికేషన్ ఫారం మీద అతికించాలి)

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. ఈ ఉద్యోగాలు ఎన్ని నెలల కాంట్రాక్టుపై ఉంటాయి?
    ఒక సంవత్సరం పాటు లేదా అవసరం ఉన్నంత వరకు ఉంటాయి. ఈ రెండిటిలో ఏది ముందు వస్తే అది వర్తిస్తుంది.
  2. దరఖాస్తు ఫీజు ఉందా?
    ఈ ప్రకటనలో దరఖాస్తు ఫీజు గురించి చెప్పలేదు.
  3. ఇంటర్వ్యూ ఉంటుందా లేదా మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారా?
    ఈ వివరాలు త్వరలో జిల్లా అధికారులు తెలియజేస్తారు.
  4. కాంట్రాక్ట్ మరియు అవుట్‍సోర్సింగ్ అంటే ఏమిటి?
    కాంట్రాక్ట్ అంటే మీరు నేరుగా ప్రభుత్వానికి ఒక ఒప్పందం ప్రకారం పనిచేస్తారు. అవుట్‍సోర్సింగ్ అంటే ఒక వేరే సంస్థ ద్వారా మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటారు.
  5. ఈ పోస్టులు శాశ్వత ఉద్యోగాలు అవుతాయా?
    ఇవి తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే. అవసరాన్ని బట్టి పెంచే అవకాశం ఉండవచ్చు, కానీ తప్పకుండా శాశ్వతం చేస్తారని చెప్పలేము.

ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ను రోజు సందర్శించండి.

Leave a Comment