ప్రముఖ IT కంపెనీ టెక్ మహీంద్రా ఇప్పుడు Customer Service Associate పోస్టులకు ఫ్రెషర్ల కోసం భారీగా నియామకాలు చేపట్టింది. మీరు కొత్తగా డిగ్రీ పూర్తి చేసి, మంచి కంపెనీలో కెరీర్ మొదలుపెట్టాలనుకుంటే, ఇది మీకు మంచి అవకాశం! ఎలాంటి అనుభవం లేకున్నా ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు . ఇంటర్వ్యూలు హైదరాబాద్లో జరుగుతున్నాయి.
ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
ఉద్యోగ వివరాలు (Job Details):
విభాగం | సమాచారం |
---|---|
కంపెనీ పేరు | టెక్ మహీంద్రా |
వెబ్‌సైట్ | techmahindra.com |
ఉద్యోగ రోల్ | Customer Service Associate |
అర్హత | ఏదైనా డిగ్రీ / PG డిగ్రీ |
అనుభవం | 0 – 2 సంవత్సరాలు |
బ్యాచ్ | 2022 / 2023 / 2024 |
జీతం | ₹1 – ₹2.25 లక్షలు (సంవత్సరానికి) |
ఉద్యోగ స్థలం | హైదరాబాదు |
ఇంటర్వ్యూ స్థలం | హైదరాబాదు |
Walk-in తేదీలు | 2 జూన్ – 11 జూన్ 2025 |
సమయం | ఉదయం 9:30AM – మధ్యాహ్నం 3:30PM |
అర్హత (Eligibility Criteria):
- బేసిక్ ఇంగ్లిష్ తోపాటు తెలుగు / హిందీ / కన్నడ / తమిళం లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి (ఒక భాష సరిపోతుంది)
- ఫ్రెషర్లు మరియు అనుభవం ఉన్నవారు ఇద్దరూ అప్లై చేయవచ్చు
- Sales అనుభవం ఉంటే అదనపు ప్లస్
- ఆఫీసులో పని చేయడానికి రెడీగా ఉండాలి
- వెంటనే జాయిన్ అవదలచుకున్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- క్యాబ్ సదుపాయం లేదు
మీ రోల్ & బాధ్యతలు (Roles & Responsibilities):
- కస్టమర్ కాల్స్ అటెండ్ చేయాలి
- ప్రోడక్ట్ వివరాలు కస్టమర్‌కి వివరించాలి
- సర్వే, ఫీడ్‌బ్యాక్, enquiry కి సంభందించిన కాల్స్ హ్యాండిల్ చేయాలి
- కస్టమర్ల సమస్యలకి పరిష్కారం ఇవ్వాలి
ఇంటర్వ్యూ స్థలం & తేదీలు (Walk-in Details):
తేదీలు | సమయం | అడ్రస్ | కాంటాక్ట్ |
---|---|---|---|
2 జూన్ – 11 జూన్ 2025 | 9:30AM – 3:30PM | Pranav’s One Building, 5th Floor, Irrum Manzil మెట్రో స్టేషన్ ఎదురుగా, హైదరాబాదు | Gujarathi Praneeth – 08801638087 |
ఎలా అప్లై చేయాలి (How to Apply):
ఇంటర్వ్యూకి ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. క్రింద లింక్ ద్వారా అప్లై చేసుకోండి:
👉ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి
దరఖాస్తు ఫీజు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️ఆధార్ సంస్థలో ఇంటర్న్‌షిప్-నెలకు ₹50,000 వరకు స్టైపెండ్
కంపెనీ గురించి (About Tech Mahindra):
టెక్ మహీంద్రా బిజినెస్ సర్వీసెస్, టెక్ మహీంద్రా కంపెనీకి భాగం. ఇది మహీంద్రా గ్రూప్‌కు చెందినది. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో 1,31,500+ ప్రొఫెషనల్స్‌తో $4.9 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. Tech Mahindra BPS డిపార్ట్‌మెంట్ ద్వారా Customer Support, Back Office సేవలు అందిస్తోంది. అనేక రంగాల్లో సేవలు అందిస్తోంది – Communication, Retail, Healthcare, Banking, Hospitality & ఇంకా చాలానే.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):
1. ఫ్రెషర్లు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేయచ్చా?
అవును! ఫ్రెషర్లు ఈ ఉద్యోగానికి పూర్తిగా అర్హులు.
2. ఇంటర్వ్యూ ఎప్పుడు మరియు ఎక్కడ జరుగుతుంది?
2 జూన్ నుండి 11 జూన్ వరకు, ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు, హైదరాబాద్లో జరుగుతుంది.
3. కస్టమర్ సపోర్ట్ జాబ్‌కి ఏ భాషలు అవసరం?
తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళ భాషల్లో ఏదైనా ఒక భాష మాట్లాడగలిగితే సరిపోతుంది.
4. ఇంటర్వ్యూకి ఏదైనా ఫీజు తీసుకుంటారా?
లేదు, ఇది ఫ్రీ Walk-in Interview.
5. సెలెక్ట్ అయితే ఎప్పుడు జాయిన్ అవ్వాలి?
సెలెక్ట్ అయిన తర్వాత వెంటనే జాయిన్ అవ్వాలి.