సౌత్ ఇండియన్ బ్యాంక్ 2025 సంవత్సరానికి సంబంధించి జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 28 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు, ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవాళ్లు ఈ అవకాశానికి అర్హులు. ఆన్లైన్ అప్లికేషన్లు మే 19 నుండి మే 26, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. బ్యాంకులో మంచి కెరీర్ మొదలుపెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాన్స్!
ఈ పోస్టులు టార్గెట్ బేస్డ్ సేల్స్ రోల్ కావడంతో, అభ్యర్థులు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు టార్గెట్‌లు చేరుకునే క్షమత కూడా ఉండాలి.
ఉద్యోగ వివరాలు (Job Overview)
అంశం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | సౌత్ ఇండియన్ బ్యాంక్ |
పోస్టు పేరు | జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ |
ఉద్యోగం విధానం | కాంట్రాక్టు – మొదటి 3 సంవత్సరాలు |
అప్లికేషన్ విధానం | ఆన్లైన్ |
అప్లికేషన్ తేదీలు | మే 19 నుండి మే 26, 2025 వరకు |
విద్యార్హత | ఏదైనా డిగ్రీ పూర్తి అయి ఉండాలి |
వయస్సు పరిమితి | గరిష్ఠంగా 28 సంవత్సరాలు (SC/ST కు 5 సంవత్సరాల మినహాయింపు) |
జీతం | రూ. 7.44 లక్షలు వార్షికంగా (CTC) |
అప్లికేషన్ ఫీజు | జనరల్ – ₹500/- ; SC/ST – ₹200/- |
ఉద్యోగ స్థలం | ఇండియాలో ఎక్కడైనా |
అధికారిక వెబ్‌సైట్ | www.southindianbank.com |
అర్హత ప్రమాణాలు
విద్యార్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేయాలి. ఎలాంటి మార్కుల పరిమితి లేదు.
వయస్సు పరిమితి:
అభ్యర్థి వయస్సు 2025 ఏప్రిల్ 30 నాటికి 28 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండకూడదు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు ఉంటుంది (అంటే 33 సంవత్సరాల వరకూ అప్లై చేయొచ్చు).
అప్లికేషన్ ఫీజు
కేటగిరీ | ఫీజు |
---|---|
జనరల్ | ₹500/- |
SC / ST | ₹200/- |
గమనిక: ఫీజు ఆన్లైన్‌లోనే చెల్లించాలి. ఇతర మార్గాలు అంగీకరించరు.
ఎలా అప్లై చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్ www.southindianbank.com ని సందర్శించండి
- “Careers” సెక్షన్‌లోకి వెళ్లి “Junior Officer Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయండి
- మీ పేరు, ఈమెయిల్ ID, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వండి
- అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి
- ఫోటో, సిగ్నేచర్, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి
- అప్లికేషన్ ఫీజు ఆన్లైన్‌లో చెల్లించండి
- అప్లికేషన్ సబ్మిట్ చేసి, కన్ఫర్మేషన్ కాపీ సేవ్ చేసుకోండి
ఎంపిక ప్రక్రియ
ఎంపిక రెండు దశలలో జరుగుతుంది:
- ఆన్లైన్ టెస్ట్ – అభ్యర్థి టాలెంట్, అప్టిట్యూడ్ అంచనా వేసేందుకు
- పర్సనల్ ఇంటర్వ్యూ – సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూ
ఈ ఉద్యోగం సేల్స్ టార్గెట్లతో కూడిన రోల్ కావడంతో కమ్యూనికేషన్ స్కిల్స్, కన్విన్సింగ్ పవర్ తప్పనిసరి.
👉South Indian Bank Recruitment 2025 Notification PDF
జీతం మరియు ఉద్యోగ నిబంధనలు
- CTC (Cost to Company): ₹7.44 లక్షలు/ఏటా
ఇందులో NPS, ఇన్సూరెన్స్, పెర్ఫార్మెన్స్ బోనస్ మొదలైనవి ఉంటాయి. - ఉద్యోగ కాలం: మొదట 3 ఏళ్ల కాంట్రాక్టు, పెర్ఫార్మెన్స్ బట్టి పొడిగించే అవకాశం ఉంటుంది.
- భవిష్యత్ ప్రమోషన్: మంచి పనితీరు ఉన్న అభ్యర్థులకు Assistant Manager (Scale I) పోస్టుకి ప్రమోషన్ అవకాశం ఉంటుంది. ఇది బ్యాంక్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
- జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అప్లై చేసేందుకు లింక్
👉 South Indian Bank Recruitment 2025 Apply Online
(అప్లికేషన్ లింక్ మే 19, 2025 నుంచి యాక్టివ్ అవుతుంది)
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ లో ఎంత మార్క్స్ అవసరం?
ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. కానీ ఎలాంటి మార్కుల పరిమితి లేదు.
2. అప్లికేషన్ ఫీజు ఎంత?
జనరల్ కేటగిరీకి ₹500/- మరియు SC/ST అభ్యర్థులకు ₹200/-.
3. ఎంపిక విధానం ఏంటి?
ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
4. ఈ ఉద్యోగం పర్మనెంట్‌గా మారుతుందా?
పెర్ఫార్మెన్స్ బట్టి బ్యాంక్ నిర్ణయంతో రెగ్యులర్ ఉద్యోగం (Assistant Manager)గా మారే అవకాశం ఉంటుంది.
5. వయస్సు మినహాయింపు ఎవరికీ ఉంటుంది?
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు ఉంటుంది.