NCL Technician Recruitment 2025|ITI అర్హతతో 200 టెక్నీషియన్ ఉద్యోగాలు

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) 2025 సంవత్సరానికి టెక్నీషియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్సీఎల్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2025 ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి మరియు ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలలో ఉన్న NCL మైన్స్‌లో ఉంటాయి. అర్హత ఉన్న అభ్యర్థులు 10 మే 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది ఒక మంచి అవకాశం.

భారతీయ పౌరులందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఆర్టికల్‌లో NCL టెక్నీషియన్ జాబ్స్‌కు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, జీతం వివరాలు, పరీక్ష నమూనా తదితర వివరాలు ఉన్నాయి. పూర్తిగా చదవండి.

ఎన్సీఎల్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2025 – ముఖ్య సమాచారం

అంశంవివరాలు
సంస్థ పేరునార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL)
పోస్టు పేరుటెక్నీషియన్ (ట్రెయినీ)
ఖాళీలు200
దరఖాస్తు ప్రారంభ తేదీ17 ఏప్రిల్ 2025 (ఉదయం 10:00 గంటల నుండి)
దరఖాస్తు చివరి తేదీ10 మే 2025 (రాత్రి 11:59 వరకు)
నోటిఫికేషన్ తేదీ16 ఏప్రిల్ 2025
ప్రకటన సంఖ్యNCL/HQ/PD/Manpower/DR/2025-26/65
అధికారిక వెబ్‌సైట్www.nclcil.in
ఎంపిక విధానంకంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
విద్యార్హతITI
గరిష్ట వయస్సు30 సంవత్సరాలు

ఖాళీల విభజన (విభాగాల వారీగా)

విభాగం పేరుపోస్టుల సంఖ్య
Technician Fitter (Trainee)95
Technician Electrician (Trainee)95
Technician Welder (Trainee)10
మొత్తం200

అర్హతలు మరియు వయస్సు పరిమితి

పోస్టు పేరువిద్యార్హతవయస్సు పరిమితి
Technician (Fitter, Electrician, Welder)పదోతరగతి ఉత్తీర్ణత + 2 సంవత్సరాల ITI ట్రేడ్ కోర్సు + NCVT/SCVT ట్రేడ్ సర్టిఫికెట్ + 1 సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ సర్టిఫికెట్కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు వివరాలు

వర్గంఫీజు
యూరీ / ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) / EWSరూ. 1180 (GST సహా)
SC / ST / ESM / PwBD / శాఖా అభ్యర్థులుఫీజు లేదు

ఎంపిక విధానం – పరీక్ష వివరాలు

ఎన్సీఎల్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. ప్రతి పోస్టుకు ప్రత్యేక పరీక్ష ఉంటుంది.

పరీక్ష విధానం:

విభాగంప్రశ్నలుమార్కులుకాలవ్యవధి
టెక్నికల్ నాలెడ్జ్ (Section A)707090 నిమిషాలు
జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, అంకగణితం (Section B)3030
మొత్తం100100

గమనిక: నెగటివ్ మార్కింగ్ లేదు.

కనీస అర్హత మార్కులు (Cut-Off)

వర్గంగరిష్ట మార్కులుకనీస అర్హత మార్కులు
UR / EWS10050 మార్కులు
SC / ST / OBC (NCL) / PwBD / ESM10040 మార్కులు

జీతం వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు చక్కటి జీతం లభిస్తుంది. ప్రాథమిక జీతంతో పాటు DA, బోనస్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ సబ్సిడీ, మెడికల్ సదుపాయాలు లభిస్తాయి.

పోస్టు పేరురోజుకు ప్రాథమిక జీతం
Technician Fitterరూ. 1583.32
Technician Electricianరూ. 1583.32
Technician Welderరూ. 1536.50

👉NCL Technician Recruitment 2025 Notification PDF

ఎలా దరఖాస్తు చేయాలి?

  1. NCL అధికారిక వెబ్‌సైట్ www.nclcil.in ను ఓపెన్ చేయండి.
  2. Careers సెక్షన్‌కి వెళ్లి “Technician Recruitment 2025” నోటిఫికేషన్‌ను క్లిక్ చేయండి.
  3. “Apply Online” లింక్‌పై క్లిక్ చేయండి.
  4. మీ పూర్తి వివరాలు (ఫోటో, సంతకం, విద్యార్హతలు, ఇతర సమాచారం) నమోదు చేయండి.
  5. అవసరమైతే దరఖాస్తు ఫీజు చెల్లించండి.
  6. దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.

👉NCL Technician Recruitment 2025 అప్లికేషన్ లింక్

ముఖ్యమైన తేదీలు

అంశంతేదీ
దరఖాస్తు ప్రారంభ తేదీ17 ఏప్రిల్ 2025 (ఉ. 10:00 నుండి)
దరఖాస్తు ముగింపు తేదీ10 మే 2025 (రా. 11:59 వరకు)

FAQs – తరచుగా అడిగే ప్రశ్నలు

1. NCL Technician Recruitment 2025కు అర్హతలు ఏమిటి?
పదోతరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్‌లో 2 సంవత్సరాల ITI కోర్సు, ట్రేడ్ సర్టిఫికెట్ మరియు 1 సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ అవసరం.

2. దరఖాస్తు చివరి తేదీ ఏమిటి?
2025 మే 10 అర్ధరాత్రి 11:59 వరకు.

3. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT) ద్వారా ఎంపిక జరుగుతుంది.

4. దరఖాస్తు ఫీజు ఎంత?
యూరీ/ఓబీసీ/EWS అభ్యర్థులకు రూ. 1180; SC/ST/PwBD/ESM అభ్యర్థులకు ఫీజు లేదు.

5. జీతం ఎంత ఉంటుంది?
రూ. 1536.50 నుండి రూ. 1583.32 వరకు రోజుకు ప్రాథమిక జీతం, అదనంగా అలవెన్సులు ఉంటాయి.

ఈ ఉద్యోగాలకు మీరు అర్హులు అయితే వెంటనే అప్లై చేయండి.

Leave a Comment