మహారాష్ట్రలోని ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన MDL (మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్) ఇప్పుడు అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 523 ఖాళీలు ఉన్నాయి. 8వ తరగతి, 10వ తరగతి, ITI చదివిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మంచి శిక్షణతో పాటు, ప్రభుత్వ రంగంలో కెరీర్ మొదలుపెట్టాలనుకునేవాళ్లకు ఇది బెస్ట్ అవకాశం. చివరి తేదీ 30 జూన్ 2025, కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి.
ఉద్యోగ వివరాలు
విభాగం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ |
పోస్టు పేరు | అప్రెంటిస్ (Apprentice) |
మొత్తం ఖాళీలు | 523 |
జీతం | సంస్థ నిబంధనల ప్రకారం |
పని చేయాల్సిన చోటు | మహారాష్ట్ర |
అప్లికేషన్ విధానం | ఆన్లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | mazagondock.in |
పోస్టుల వివరాలు & అర్హత
ట్రేడ్ పేరు | ఖాళీలు | అర్హత |
---|---|---|
డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్) | 28 | 10వ తరగతి |
ఎలక్ట్రీషియన్ | 43 | 10వ తరగతి |
ఫిట్టర్ | 52 | 10వ తరగతి |
పైప్ ఫిట్టర్ | 44 | 10వ తరగతి |
స్ట్రక్చరల్ ఫిట్టర్ | 47 | ITI |
ఫిట్టర్ స్ట్రక్చరల్ (Ex. ITI) | 40 | ITI |
డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్) | 20 | ITI |
ఎలక్ట్రీషియన్ | 40 | ITI |
ICTSM | 20 | ITI |
ఎలక్ట్రానిక్ మెకానిక్ | 30 | ITI |
RAC | 20 | ITI |
పైప్ ఫిట్టర్ | 20 | ITI |
వెల్డర్ | 35 | ITI |
COPA | 20 | ITI |
కార్పెంటర్ | 30 | ITI |
రిగ్గర్ | 14 | 8వ తరగతి |
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) | 20 | ITI |
వయస్సు పరిమితి
ట్రేడ్ పేరు | వయస్సు (సంవత్సరాలు) |
---|---|
డ్రాఫ్ట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ మొదలైనవి | 15 – 19 |
ITI ట్రేడ్స్ (Ex. ITI) | 16 – 21 |
రిగ్గర్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) | 14 – 18 |
అప్లికేషన్ ఫీజు
కేటగిరీ | ఫీజు |
---|---|
UR / OBC / SEBC / EWS | ₹100/- |
SC / ST / PWD | లేవు (ఫ్రీ) |
పేమెంట్ విధానం | ఆన్లైన్ ద్వారా |
సెలెక్షన్ ప్రక్రియ
- ఆన్లైన్ టెస్ట్
- ఇంటర్వ్యూ
ముఖ్యమైన తేదీలు
విషయం | తేదీ |
---|---|
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 10 జూన్ 2025 |
అప్లికేషన్ చివరి తేదీ | 30 జూన్ 2025 |
ఆన్లైన్ పరీక్ష తేదీ | 02 ఆగస్ట్ 2025 |
అప్లై చేసుకోవడం ఎలా?
- అధికారిక వెబ్‌సైట్ mazagondock.in కి వెళ్లండి
- “Apprentice Recruitment 2025” నోటిఫికేషన్ ఓపెన్ చేసి చదవండి
- అర్హత ఉందో లేదో చెక్ చేసుకోండి
- అప్లికేషన్ ఫామ్‌ను తప్పులు లేకుండా పూరించండి
- అవసరమైతే ఫీజు చెల్లించండి
- 30 జూన్ 2025 లోపు అప్లికేషన్ సమర్పించండి
👉MDL Trade Apprentice Recruitment 2025 Notification PDF
అప్లై లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
✴️NARL చిత్తూరులో JRF జాబ్స్ 13 పోస్టులు
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. నేను ఫ్రెషర్‌ని, అప్లై చేయచ్చా?
అవును, ఫ్రెషర్స్ కూడా ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయొచ్చు.
2. ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం గ్యారెంటీగా వస్తుందా?
ఇది ట్రైనింగ్ ప్రోగ్రాం మాత్రమే. ఉద్యోగం గ్యారెంటీ కాదు, కానీ మంచి అనుభవం దొరుకుతుంది.
3. ఐటీఐ చేయని వాళ్లు ఏ పోస్టులకు అప్లై చేయొచ్చు?
8వ తరగతి చదివినవాళ్లు “రిగ్గర్” పోస్టులకు, 10వ తరగతి చదివినవాళ్లు ఇతర కొన్ని పోస్టులకు అప్లై చేయవచ్చు.
4. ఫీజు ఎలాంటి పద్ధతిలో చెల్లించాలి?
ఫీజు ఆన్లైన్‌లోనే చెల్లించాలి. డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా చేయవచ్చు.
5. ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడుంటుంది?
ఆగస్ట్ 2, 2025న ఆన్లైన్ టెస్ట్ జరగనుంది.