LIC HFL Apprentice Recruitment 2025:250 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల! ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) ఇప్పుడు అప్రెంటిస్ పోస్టుల కోసం 250 ఖాళీలను భర్తీ చేస్తోంది. డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించోకోవచ్చు. ఈ అప్రెంటిస్‌షిప్ వలన బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం రావడమే కాక, భవిష్యత్తులో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థల్లో మంచి జాబ్స్ దక్కించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలు కింద చదవండి!

LIC HFL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 – పూర్తి వివరాలు

సంస్థ పేరుLIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL)
పోస్టు పేరుఅప్రెంటిస్ (Apprentice)
మొత్తం ఖాళీలు250
అప్లికేషన్ మొదలు13 జూన్ 2025
స్టైపెండ్₹12,000/- నెలకు
చివరి తేదీ28 జూన్ 2025
విద్యార్హతఏదైనా డిగ్రీ పూర్తవ్వాలి
వయస్సు పరిమితికనీసం 20 సంవత్సరాలు – గరిష్ఠం 25 సంవత్సరాలు
ట్రైనింగ్ కాలం12 నెలలు
అధికారిక వెబ్‌సైట్www.licindia.in

అర్హతల వివరాలు

విద్యార్హత:
ఎవరైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు పరిమితి:
2025 నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థి వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్

LIC HFL అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన తర్వాత, BOAT (Board of Apprenticeship Training) అనే ప్రభుత్వ సంస్థ నుంచి ఒక అధికారిక సర్టిఫికెట్ ఇస్తారు. ఇది ఒక “అప్రెంటిస్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్” లాంటిది.

ఆ సర్టిఫికెట్ మీ వద్ద ఉండటంతో, మీరు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా ఇతర BFSI (Banking, Financial Services, and Insurance) రంగాల్లో ఖాళీలు ఉన్నపుడు అక్కడ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.

రాష్ట్రాల వారీగా ఖాళీలు

రాష్ట్రంఖాళీలు
ఆంధ్రప్రదేశ్20
తెలంగాణ24
కర్ణాటక36
తమిళనాడు36
మహారాష్ట్ర34
మిగతా రాష్ట్రాలువివిధం
మొత్తం250

సిటీ వైజ్ ఖాళీల పూర్తి జాబితా నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంది.

👉LIC HFL Apprentice Recruitment 2025 Notification PDF

అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు కేటగిరీ ఆధారంగా బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్ కౌన్సిల్‌కి ఫీజు చెల్లించాలి.

కేటగిరీఫీజు
జనరల్, OBC₹944
SC, ST, మహిళలు₹708
PwBD అభ్యర్థులు₹472

ఎగ్జామ్ ఎలా ఉంటుంది?

LIC HFL అప్రెంటిస్ ఎగ్జామ్ ఆన్‌లైన్ రిమోట్ ప్రాక్టర్డ్ మోడ్‌లో జరుగుతుంది అంటే మీరు ఇంటి నుంచి మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా రాయచ్చు. కేవలం స్మార్ట్‌ఫోన్, ఫ్రంట్ కెమెరా, స్టేబుల్ ఇంటర్నెట్ అవసరం.

అంశంవివరాలు
ఎగ్జామ్ టాపిక్స్బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, డిజిటల్/కంప్యూటర్ లిటరసీ, ఇంగ్లీష్
ప్రశ్నలు100 Multiple Choice Questions
ఎగ్జామ్ వ్యవధి60 నిమిషాలు
ఎగ్జామ్ మోడ్ఇంటి నుంచే ఆన్‌లైన్

ముఖ్యమైన తేదీలు

ఈవెంట్తేదీ
ఆన్‌లైన్ అప్లికేషన్ మొదలు13 జూన్ 2025
అప్లికేషన్ చివరి తేదీ28 జూన్ 2025
ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ30 జూన్ 2025
ఆన్‌లైన్ ఎగ్జామ్03 జూలై 2025
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ08 – 09 జూలై 2025 (అంచనా)
ఆఫర్ లెటర్ ఇవ్వడం10 – 11 జూలై 2025 (అంచనా)
జాయినింగ్ తేదీ14 జూలై 2025 (అంచనా)

అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి:

👉LIC HFL అప్రెంటిస్ అప్లికేషన్ లింక్

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️Central Bank లో Apprentice 4500 పోస్టులు

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా?
అవును, ప్రతి నెల ₹12,000 స్టైపెండ్ వస్తుంది.

2. ఇంటర్వ్యూకి ముందు ఏ ఎగ్జామ్ ఉంటుంది?
100 మార్కుల ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఇది ఇంటి నుంచే రాయొచ్చు.

3. డిగ్రీ ఏ బ్రాంచ్ అయినా సరిపోతుందా?
అవును, ఏ డిసిప్లిన్ అయినా డిగ్రీ ఉంటే సరిపోతుంది.

4. 26 ఏళ్ల అభ్యర్థులు అప్లై చేయచ్చా?
లేదు, కనీసం 20 – గరిష్ఠంగా 25 సంవత్సరాల వయసున్న వాళ్లే అప్లై చేయాలి.

5. రిజర్వేషన్ లేదా వయస్సు సడలింపు ఉందా?
నోటిఫికేషన్ ప్రకారం వయస్సు పరిమితి ఖచ్చితంగా 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి. సడలింపుల వివరాలు ప్రస్తావించలేదు.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment