మన భారత దేశ రైల్వే కి చెందిన IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) సౌత్ సెంట్రల్ జోన్ నుండి కాంట్రాక్ట్ ఆధారంగా హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్షా లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ తో సెలెక్ట్ చేస్తారు, వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ మార్చి 3, 2025.
IRCTC Secunderabad Recruitment 2025 ఉద్యోగ వివరాలు
ఖాళీలు
ఇందులో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. జనరల్ క్యాటగిరీకి 2 పోస్టులు, ఓబీసీ క్యాటగిరీకి 3 పోస్టులు, ఎస్సీ క్యాటగిరీకి 1 పోస్ట్ ఉన్నాయి.
IRCTC Secunderabad Recruitment 2025 అర్హతలు
ఈ ఉద్యోగానికి అర్హత పొందేందుకు అభ్యర్థులు క్రింద కోర్సులలో ఏదైనా ఒకటి పూర్తిచేసి ఉండాలి:
B.Sc. (హోటల్ మేనేజ్మెంట్ & హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్) – రాష్ట్ర/కేంద్ర హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ (CIHM/SIHM/PIHM) నుండి పూర్తి చేసి ఉండాలి.
BBA/MBA (కలినరీ ఆర్ట్స్) – భారత ప్రభుత్వ టూరిజం మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్స్ నుండి పూర్తి చేసి ఉండాలి.
B.Sc. (హోటల్ మేనేజ్మెంట్ & కేటరింగ్ సైన్స్) – ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి పూర్తిచేసి ఉండాలి.
MBA (టూరిజం & హోటల్ మేనేజ్మెంట్) – ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పూర్తి చేసి ఉండాలి.
అనుభవం
అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
IRCTC Secunderabad Recruitment 2025 వయో పరిమితి
అభ్యర్థులు 01-01-2025 నాటికి 28 సంవత్సరాల లోపు ఉండాలి.
వయస్సు సడలింపు
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు, వారు పనిచేసిన సేవ కాలంతో పాటు 3 సంవత్సరాల అదనపు సడలింపు వర్తిస్తుంది.
IRCTC Secunderabad Recruitment 2025 అప్లికేషన్ ఫీజు
ఈ పోస్టుకు అప్లై చేసుకునేవారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
IRCTC Secunderabad Recruitment 2025 జీతం
జీతం నెలకు రూ.30,000/- ఉంటుంది.
ఇతర భత్యాలు
ప్రతిరోజు భత్యంగా రూ. 350/- అందించబడుతుంది. 12 గంటలకు పైగా పని చేసినట్లయితే పూర్తి మొత్తాన్ని, 6 నుంచి 12 గంటల మధ్య పని చేస్తే జీతంలో ఉన్న 70% భత్యాన్ని, 6 గంటల కన్నా తక్కువ పని చేసినట్లయితే జీతంలో ఉన్న 30% అందించబడుతుంది.
ఔట్స్టేషన్లో రాత్రి బస అవసరమైనప్పుడు రూ. 240/- బస ఖర్చుగా ఇవ్వబడుతుంది.
జాతీయ సెలవుదినాల్లో పని చేసిన వారికి రూ. 384/- జాతీయ సెలవు భత్యంగా అందించబడుతుంది.
మెడికల్ ఇన్సూరెన్స్ రీయింబర్స్మెంట్ IRCTC ప్రస్తుత విధానాల ప్రకారం అందించబడుతుంది.
IRCTC Secunderabad Recruitment 2025 ఎంపిక విధానం
అభ్యర్థుల ప్రదర్శనను ఆధారంగా తీసుకుని మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ కొరకు సూచనలు
అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపాలి.
అసలు ధృవపత్రాలు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి.
మొత్తం 06 మందిని ఎంపిక చేసి, అదనపు 06 మందిని రిజర్వ్ ప్యానెల్లో ఉంచుతారు.
ఎంపికైన అభ్యర్థులకు పని చేసే ప్రాంతాలు:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ (అలాగే, అవసరాన్ని బట్టి అభ్యర్థులను భారతదేశంలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంది.)
ప్రధాన బాధ్యతలు:
ఫుడ్ ప్రొడక్షన్, క్వాలిటీ మరియు సేవల పర్యవేక్షణ
కంపెనీ విధానాలు మరియు హాస్పిటాలిటీ ప్రమాణాల అమలు
కస్టమర్ ఫీడ్బ్యాక్ సేకరణ, విశ్లేషణ మరియు మెరుగుదల చర్యలు
ఉద్యోగుల ట్రైనింగ్ మరియు మెరుగైన సేవలు అందించే విధంగా పర్యవేక్షణ
IRCTC Secunderabad Recruitment 2025 PDF Link
ఇంటర్వ్యూకు హాజరయ్యే వివరాలు:
వేదిక: IRCTC, సౌత్ సెంట్రల్ జోన్, జోన్ కార్యాలయం, 1వ అంతస్తు, ఆక్స్ఫర్డ్ ప్లాజా, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్ – 500 003
తేదీ: 04-03-2025
ఇంటర్వ్యూకు తేదీ పొడిగింపబడితే, అభ్యర్థులు తమ స్వంతంగా బస, భోజన ఏర్పాట్లు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలు ప్రాథమికంగా 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి. అభ్యర్థి పనితీరు, అవసరం ఆధారంగా మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంది.
ఇంకా ఏవైనా మార్పులు ఉంటే, IRCTC అధికారిక వెబ్సైట్ www.irctc.com ద్వారా తెలుసుకోవచ్చు.
IRCTC Secunderabad Recruitment 2025 – FAQs
1. ఈ ఉద్యోగానికి రాత పరీక్ష ఉందా?
లేదు, ఈ ఉద్యోగానికి రాత పరీక్ష లేదు. అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
2. అర్హతలు ఏమిటి?
B.Sc (హోటల్ మేనేజ్మెంట్), BBA/MBA (కలినరీ ఆర్ట్స్), B.Sc (కేటరింగ్ సైన్స్), లేదా MBA (టూరిజం & హోటల్ మేనేజ్మెంట్) కోర్సుల్లో ఏదైనా పూర్తి చేసి ఉండాలి. అలాగే, కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
3. వయో పరిమితి ఎంత?
జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికులకు అదనపు సడలింపు ఉంటుంది.
4. జీతం ఎంత ఉంటుంది?
నెలకు రూ.30,000/- జీతంగా పొందవచ్చు. అదనంగా రోజువారీ భత్యం, బస ఖర్చులు, జాతీయ సెలవుదిన భత్యం మరియు మెడికల్ ఇన్సూరెన్స్ రీయింబర్స్మెంట్ అందించబడుతుంది.
5. ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది?
ఇంటర్వ్యూ IRCTC సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయం, సికింద్రాబాద్లో మార్చి 4, 2025న జరుగుతుంది. అభ్యర్థులు అన్ని అసలు ధృవపత్రాలు, జిరాక్స్ కాపీలు, ఫోటోలు తీసుకురావాలి.