India Post GDS Notification 2025 | ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ వారు దేశవ్యాప్తంగా 21,413 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్బీ, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ వంటి పోస్టులు వున్నాయి, దేశవ్యాప్తంగా 21,413 ఖాళీలు వున్నాయి. ఏపీలో 1215, తెలంగాణాలో 519 ఖాళీలున్నాయి. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 03. ఈ నోటిఫికేషన్ గురుంచి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాము, పూర్తిగా చదవి, మీరు అర్హులు ఐతే, వెంటనే దరఖాస్తు చేసుకోండి, అప్లికేషన్ లింక్ క్రింద ఇచ్చాము.
India Post GDS 2025 విద్యార్హత (Educational Qualification)
1. GDS ఉద్యోగానికి అప్లై చేయాలంటే అభ్యర్థి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. గణితము (Mathematics) మరియు ఇంగ్లీష్ (English) లో ఉత్తీర్ణత మార్కులు ఉండాలి.
2. అభ్యర్థి తన స్థానిక భాష (Local Language) కనీసం 10వ తరగతి వరకు చదివి ఉండాలి. తెలుగు రాష్ట్రాల వారికి, తెలుగు రావాలి.
3. కంప్యూటర్ పరిజ్ఞానం (Computer గురించిన బేసిక్ అవగాహన ఉండాలి).
4. సైకిల్ నడపడం తెలిసి ఉండాలి.
India Post GDS 2025 Age Limit
GDS ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. వయస్సును దరఖాస్తు చివరి తేదీ ప్రకారం లెక్కిస్తారు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. EWS అభ్యర్థులకు మినహాయింపు లేదు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు, PWD + OBC అభ్యర్థులకు 13 సంవత్సరాలు, PWD + SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది.
India Post GDS 2025 ఎంపిక విధానం
1. GDS ఉద్యోగాల ఎంపిక కంప్యూటర్ ద్వారా తయారు చేసే మెరిట్ లిస్ట్ ఆధారంగా జరుగుతుంది. 10వ తరగతి మార్కులు లేదా గ్రేడ్ పాయింట్లు తీసుకుని లెక్కిస్తారు. గ్రేడ్ మాత్రమే ఉన్నవారి కోసం ప్రత్యేక గుణకం (9.5) ఉపయోగిస్తారు. కొన్ని విద్యా మండళ్లు మార్కులు, గ్రేడ్ రెండింటినీ ఇస్తే, మార్కుల ప్రకారం ఎంపిక జరుగుతుంది. ఒకే స్కోర్ వచ్చినప్పుడు, పెద్ద వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. తప్పు సమాచారం ఇచ్చినవారి దరఖాస్తును రద్దు చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇవ్వలేదని అంగీకరించిన అండర్‌టేకింగ్ సమర్పించాలి. అభ్యర్థులు తమ పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ 10వ తరగతి సర్టిఫికేట్‌లో ఉన్నట్లుగా నమోదు చేయాలి. స్పష్టంగా కనిపించని ఫోటో లేదా సంతకం ఉంటే దరఖాస్తును తిరస్కరిస్తారు.
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ లిస్ట్లో షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
3. మెడికల్ ఫిట్నెస్ టెస్ట్: అభ్యర్థులు బేసిక్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించాలి.
India Post GDS 2025 Salary and Allowances (జీతం మరియు భత్యాలు)
BPM పోస్టుకు జీతం ₹12,000/- నుండి ₹29,380/- వరకు, ABPM/Dak Sevak పోస్టుకు ₹10,000/- నుండి ₹24,470/- వరకు ఉంటుంది.
GDS ఉద్యోగులకు Time Related Continuity Allowance (TRCA) ద్వారా జీతం చెల్లిస్తారు, ఇది ప్రతి సంవత్సరం 3% పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు Dearness Allowance (DA) కూడా అందించబడుతుంది. అదనంగా, ఇతర భత్యాలు మరియు సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు కూడా ఉంటాయి, వీటిలో GDS Gratuity మరియు Service Discharge Benefit Scheme (National Pension System లాంటి పథకం) ఉన్నాయి.
India Post GDS 2025 అప్లికేషన్ ఫీజు
మహిళలు, SC/ST, వికలాంగులు (PwD), మరియు ట్రాన్స్‌వుమన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు ₹100 ఫీజు చెల్లించాలి.
India Post GDS 2025కు ఎలా అప్లై చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – ఇండియా పోస్టు GDS వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- రిజిస్టర్ చేసుకోండి – ‘Register’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, పేరు, జన్మతేది, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వండి.
- అప్లికేషన్ ఫారం నింపండి – రిజిస్ట్రేషన్ సమయంలో పొందిన లాగిన్ వివరాలతో లాగిన్ అయి, వ్యక్తిగత, విద్యా మరియు సంప్రదింపు వివరాలు నమోదు చేయండి.
- కావాల్సిన పత్రాలు అప్‌లోడ్ చేయండి – ఫోటో, సంతకం, విద్యా ధృవపత్రాల స్కాన్ కాపీలు అప్‌లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించండి – ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- కాన్ఫర్మేషన్ పేజీ డౌన్‌లోడ్ చేసుకోండి – భవిష్యత్తులో ఉపయోగం కోసం కన్ఫర్మేషన్ పేజీని సేవ్ చేసుకోండి.
👉India Post GDS 2025 Apply Online Link-Click Here
India Post GDS 2025 ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణ ప్రక్రియ 10-02-2025 నుండి ప్రారంభమై 03-03-2025 వరకు కొనసాగుతుంది. దీని తర్వాత, అభ్యర్థులు తమ సమర్పించిన అప్లికేషన్లను ఏమైనా తప్పులు ఉంటే, సవరించడానికి లేదా దిద్దుబాటు చేసేందుకు 06-03-2025 నుండి 08-03-2025 వరకు కరెక్ట్ చేసుకోవచ్చు.
Sl No | కార్యాచరణ (Activity) | తేదీలు (Schedule) |
---|---|---|
1 | రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణ | 10-02-2025 నుండి 03-03-2025 వరకు |
2 | ఎడిట్ / కరెక్షన్ విండో | 06-03-2025 నుండి 08-03-2025 వరకు |
India Post GDS 2025 PDF Link-Click Here