ఇంటర్/డిప్లొమా అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం|CSIR AMPRI Recruitment 2025

CSIR-AMPRI, భోపాల్ వారు 2025 సంవత్సరానికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న వారందరికీ ఇది ఓ అద్భుతమైన అవకాశం. అర్హతలు, జీతం, ఎంపిక విధానం వంటి ముఖ్యమైన వివరాలను ఈ పోస్టులో అందించాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 26 ఏప్రిల్ 2025 నుండి 17 మే 2025 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అర్హతలు సరిపోతాయా చూసుకోండి.

  • గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2 లేదా ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత ఉండాలి.
  • టైపింగ్ స్పీడ్:
  • ఆంగ్లంలో నిమిషానికి 35 పదాలు లేదా
  • హిందీలో నిమిషానికి 30 పదాలు.
  • కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి.
  • 10వ తరగతి తరువాత 3 సంవత్సరాల డిప్లొమా చేసినవాళ్లు కూడా దరఖాస్తు చేయవచ్చు.

వయసు పరిమితం

  • గరిష్ఠ వయసు: 28 సంవత్సరాలు (17 మే 2025 నాటికి)
  • SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో మినహాయింపు ఉంటుంది.

ఖాళీలు వివరాలు

పోస్టు పేరుమొత్తం ఖాళీలురిజర్వేషన్ వివరాలు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)7UR-3, SC-1, ST-2, OBC (NCL)-1
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్)1UR-1
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్స్ & పర్చేజ్)1UR-1

గమనిక: ఖాళీలు అవసరమైతే పెరగడం లేదా తగ్గడం జరుగవచ్చు.

జీతం వివరాలు

  • పే లెవల్ 2 ప్రకారం జీతం: ₹19,900 నుండి ₹63,200 వరకు.
  • సగటు మొత్తం జీతం (అన్నీ కలిపి): సుమారు ₹36,220 నెలకు.
  • ఇతర ప్రయోజనాలు: వైద్య భర్తీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC), పిల్లల విద్యా భర్తీ మొదలైనవి లభిస్తాయి.

ఎంపిక విధానం

  • రాత పరీక్ష (Paper I & Paper II)
  • టైపింగ్ టెస్ట్ (కేవలం అర్హత కోసం)
  • Paper I లో అర్హత సాధించిన అభ్యర్థుల Paper II మూల్యాంకనం జరుగుతుంది.
  • ఫైనల్ మెరిట్ జాబితా కేవలం Paper II లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
  • టైపింగ్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావాలి.

దరఖాస్తు ఫీజు

  • జనరల్ / OBC / EWS: ₹500
  • SC / ST / PwBD / మహిళలు / CSIR ఉద్యోగులు: ఫీజు లేదు

👉CSIR AMPRI Recruitment 2025 Notification PDF

దరఖాస్తు విధానం

  • అధికారిక వెబ్‌సైట్: https://csirampri-jsa.onlineregistrationforms.com కు వెళ్లండి.
  • మీ ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్ ఉపయోగించి రిజిస్టర్ అవ్వండి.
  • అప్లికేషన్ ఫారమ్ నింపండి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
  • ఫీజు చెల్లించండి (అర్హత ఉన్నవారైతే).
  • దరఖాస్తు ఫారమ్ సేవ్ చేసి ప్రింట్ తీసుకోండి.

👉CSIR AMPRI Recruitment 2025 Apply Link

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 26 ఏప్రిల్ 2025
  • ఆఖరి తేదీ: 17 మే 2025 (సాయంత్రం 5 గంటల వరకు)

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. CSIR AMPRI పోస్టులకు ఎవరు అప్లై చేయవచ్చు?
10+2 లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

2. టైపింగ్ స్పీడ్ ఎంత అవసరం?
ఆంగ్లం లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి.

3. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
రాత పరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

4. దరఖాస్తు ఫీజు ఎంత?
జనరల్/OBC/EWS అభ్యర్థులకు ₹500. SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు.

5. జీతం ఎంత లభిస్తుంది?
సుమారు ₹36,220 నెలకు (అన్ని అలవెన్సులతో కలిపి).

Leave a Comment