మీకు డెయిరీ టెక్నాలజీ లేదా మార్కెటింగ్‌లో డిగ్రీ ఉందా? మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకో మంచి అవకాశం! ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (APDDCF)లో మేనేజర్ (డెయిరీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతలు ఉన్న వారు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగానికి సంబంధించిన అన్ని వివరాలు మీకోసం సింపుల్‌గా అందించాం.
పోస్టు పేరు
మేనేజర్ (డెయిరీ)
అర్హతలు
- బి.టెక్ డెయిరీ టెక్నాలజీ లేదా
- ఎంబిఏ (మార్కెటింగ్) పూర్తిచేసినవారు
అనుభవం
- ఫ్రెషర్స్ కు అవకాశం ఉంది
- లేదా 1–2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు
పోస్టుల వివరాలు (జిల్లాల వారీగా)
సంఖ్య | పని చేసే ప్రాంతం | పోస్టింగ్ లొకేషన్ | ఖాళీల సంఖ్య |
---|---|---|---|
1 | హెడ్ ఆఫీస్ | మంగళగిరి | 2 |
2 | శ్రీకాకుళం, విజయనగరం | శ్రీకాకుళం | 1 |
3 | పార్వతీపురం మన్యం | పార్వతీపురం | 1 |
4 | అల్లూరి సీతారామ రాజు | పడేరు | 1 |
5 | కాకినాడ, తూర్పు గోదావరి | రాజమహేంద్రవరం | 1 |
6 | డా.బి.ఆర్.ఎ. కోనసీమ, పశ్చిమ గోదావరి | భీమవరం | 1 |
7 | ఏలూరు | ఏలూరు | 1 |
8 | కర్నూలు, నంద్యాల | కర్నూలు | 1 |
జీతం
- నెలకి రూ. 20,000/-
- అధికారిక పనుల కోసం కమ్యూనికేషన్, ట్రావెల్ ఫెసిలిటీస్ ఇవ్వబడతాయి (ఇల్లు↔ఆఫీస్ ప్రయాణానికి కాదు)
నియామక నిబంధనలు
- ఇది ఒక ఏడాది కాంట్రాక్ట్ ఉద్యోగం, పనితీరు బాగుంటే కాలాన్ని పెంచవచ్చు.
- ఉద్యోగం తాత్కాలికం, బదిలీ ఉండదు
- అవసరమైతే నోటీసు లేకుండానే ఉద్యోగాన్ని రద్దు చేయవచ్చు
- APDDCF నియమ నిబంధనలకు లోబడి పని చేయాలి
- అనధికారిక గైర్హాజరు అయితే జీతం నుంచి కోత పడుతుంది
దరఖాస్తు లింక్:
👉 APDDCF మేనేజర్ (డెయిరీ) ఉద్యోగానికి అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ఫీజు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
⭐AP ఆరోగ్య శాఖలో అవుట్‌సోర్సింగ్ గవర్నమెంట్ ఉద్యోగాలు
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయచ్చా?
అవును, బి.టెక్ డెయిరీ టెక్నాలజీ లేదా ఎంబిఏ (మార్కెటింగ్) పూర్తిచేసిన ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు.
2. కాంట్రాక్ట్ పూర్తి అయిన తర్వాత జాబ్ కొనసాగుతుందా?
పనితీరు బాగుంటే సంస్థ అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ పీరియడ్‌ను పెంచే అవకాశం ఉంది.
3. పోస్టింగ్ ఎక్కడ వస్తుంది?
మీరు ఎక్కడ అప్లై చేస్తారో దానికి అనుగుణంగా పోస్టింగ్ ఉంటుంది – మొత్తం 8 చోట్ల ఖాళీలు ఉన్నాయి.
4. ట్రావెల్ అలవెన్సులు ఉంటాయా?
అధికారిక పనులకోసం ట్రావెల్ ఫెసిలిటీ ఉంటుంది, కానీ ఇల్లు↔ఆఫీస్ ప్రయాణానికి కాదు.
5. దరఖాస్తు ఎలా చేయాలి?
మీరు పై అప్లై లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం? మీరు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి!