ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఆరోగ్య శాఖ నుంచి మంచి వార్త!
ఇప్పుడు బయోమెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ లాంటి టెక్నికల్ జాబ్స్‌తో పాటు, థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ప్లంబర్ లాంటి సాధారణ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఆధారంగా ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే, ఇందులో 10వ తరగతి చదివినవారినుంచి బీటెక్ పూర్తి చేసినవరకు అందరికీ అవకాశాలు ఉన్నాయి!
మీరు చదివిన స్థాయికి తగ్గ ఉద్యోగం చూసుకుని వెంటనే అప్లై చేసుకోండి!
ఖాళీల వివరాలు
Sl.No | పోస్టు పేరు | ఖాళీలు | జీతం (ప్రతి నెల) | నియామకం విధానం |
---|---|---|---|---|
1 | బయో మెడికల్ ఇంజినీర్ | 1 | ₹54,060 | కాంట్రాక్ట్ |
2 | రేడియోగ్రాఫర్ | 2 | ₹35,570 | కాంట్రాక్ట్ |
3 | ల్యాబ్ టెక్నీషియన్ | 4 | ₹32,670 | కాంట్రాక్ట్ |
4 | ఆడియోమెట్రీ టెక్నీషియన్ | 1 | ₹21,500 | అవుట్సోర్సింగ్ |
5 | ఫిజియోథెరపిస్ట్ | 1 | ₹21,500 | అవుట్సోర్సింగ్ |
6 | OT అసిస్టెంట్ | 2 | ₹15,000 | అవుట్సోర్సింగ్ |
7 | రికార్డ్ అసిస్టెంట్ | 2 | ₹15,000 | అవుట్సోర్సింగ్ |
8 | ఆఫీస్ సబార్డినేట్ | 3 | ₹15,000 | అవుట్సోర్సింగ్ |
9 | ల్యాబ్ అటెండెంట్ | 2 | ₹15,000 | అవుట్సోర్సింగ్ |
10 | పోస్ట్ మార్టం అసిస్టెంట్ | 2 | ₹15,000 | అవుట్సోర్సింగ్ |
11 | GDA / MNO / FNO | 22 | ₹15,000 | అవుట్సోర్సింగ్ |
12 | ప్లంబర్ | 1 | ₹15,000 | అవుట్సోర్సింగ్ |
మొత్తం | 43 |
అర్హత వివరాలు (ప్రతి పోస్టుకు)
పోస్టు పేరు | అర్హతలు |
---|---|
బయో మెడికల్ ఇంజినీర్ | B.Tech (Bio-Medical Engg.) |
రేడియోగ్రాఫర్ | CRA / DRGA / DMIT లేదా B.Sc. (Radiology) + APPMB రిజిస్ట్రేషన్ |
ల్యాబ్ టెక్నీషియన్ | DMLT లేదా B.Sc. (MLT) + APPMB రిజిస్ట్రేషన్ |
ఆడియోమెట్రీ టెక్నీషియన్ | Intermediate + డిప్లొమా లేదా B.Sc. (Audiology) |
ఫిజియోథెరపిస్ట్ | BPT డిగ్రీ + AP Physiotherapy ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ |
రికార్డ్ అసిస్టెంట్ | 10వ తరగతి పాస్ |
ల్యాబ్ అటెండెంట్ | 10వ తరగతి + ల్యాబ్ కోర్సు లేదా Vocational MLT |
OT అసిస్టెంట్ | 10వ తరగతి + 5 సంవత్సరాల అనుభవం |
పోస్ట్ మార్టం అసిస్టెంట్ | 10వ తరగతి పాస్ |
ఆఫీస్ సబార్డినేట్ | 10వ తరగతి పాస్ |
GDA / MNO / FNO | 10వ తరగతి పాస్ |
ప్లంబర్ | 10వ తరగతి + ITI Plumbing/Fitter/Mechanic |
వయస్సు పరిమితి (01.09.2024 ప్రకారం)
వర్గం | గరిష్ట వయస్సు |
---|---|
OC | 42 సంవత్సరాలు |
SC/ST/BC/EWS | 47 సంవత్సరాలు |
Ex-Servicemen | సేవా కాలంతో పాటు 3 సంవత్సరాలు అదనంగా |
వికలాంగులు | 10 సంవత్సరాలు అదనంగా |
అంతిమ గరిష్ట వయస్సు: | 52 సంవత్సరాలు |
అప్లికేషన్ ఫీజు
వర్గం | ఫీజు |
---|---|
OC, BC, EWS | ₹500/- |
SC/ST | ₹300/- |
వికలాంగులకు | మినహాయింపు ఉంది |
ఎంపిక విధానం
- మొత్తం మార్కులు: 100
- 75 మార్కులు: విద్యా అర్హతలపై ఆధారపడి
- 10 మార్కులు: అర్హత పూర్తయ్యాక సంవత్సరాల అనుభవం
- 15 మార్కులు: కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్/కోవిడ్ సేవలపై ఆధారపడి
- అదనంగా: పల్లె/గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఎక్కువ వెయిటేజ్
👉AP DCHS Outsourcing Jobs 2025 Notification PDF & Application Form
దరఖాస్తు విధానం
- దరఖాస్తు ఫారం: అధికారిక వెబ్సైట్ లో 21.05.2025 నుండి లభిస్తుంది.
- పూర్తిగా నింపిన అప్లికేషన్ ను రెండు సెట్ సర్టిఫికెట్లతో కలిపి,
- DCHS కార్యాలయం, అనంతపురం లో 28.05.2025 సాయంత్రం 5:30 లోగా సమర్పించాలి.
దరఖాస్తు ఇచ్చిన తరువాత acknowledgment slip తప్పక తీసుకోవాలి.
👉 అధికారిక వెబ్సైట్: https://ananthapuramu.ap.gov.in
ముఖ్యమైన తేదీలు
ప్రక్రియ | తేదీలు |
---|---|
నోటిఫికేషన్ విడుదల | 19.05.2025 |
అప్లికేషన్ ప్రారంభం | 21.05.2025 |
అప్లికేషన్ ముగింపు | 28.05.2025 సాయంత్రం 5:30 వరకు |
మెరిట్ లిస్ట్ విడుదల | 14.06.2025 |
అభ్యంతరాల స్వీకరణ | 16.06.2025 – 19.06.2025 |
తుది మెరిట్ & సెలెక్షన్ లిస్ట్ | 25.06.2025 |
కౌన్సెలింగ్ & అపాయింట్మెంట్ | 01.07.2025 |
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
⭐డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీలో ఔట్సోర్సింగ్ జాబ్స్
⭐తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగాలు
⭐AP ప్రభుత్వ సంస్థలో మేనేజర్ జాబ్
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. నేను ఒక కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయవచ్చా?
అవును, కానీ ప్రతి పోస్టుకు విడిగా డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని దరఖాస్తు చేయాలి.
2. అప్లికేషన్ ఆన్లైన్లో పంపించొచ్చా?
లేదు. మీరు మాత్రమే ఫిజికల్ (ఆఫ్‌లైన్) అప్లికేషన్ మాత్రమే సమర్పించాలి.
3. కోవిడ్ సమయంలో పనిచేసినందుకు వెయిటేజ్ ఉంటుందా?
అవును, సర్టిఫికేట్ తో అప్లై చేస్తే వెయిటేజ్ లభిస్తుంది.
4. డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరి పేరుతో తీసుకోవాలి?
District Coordinator of Hospital Services, Ananthapuramu పేరుతో DD తీసుకోవాలి.
5. సర్టిఫికేట్లు మిస్ అయితే ఏమవుతుంది?
క్లియర్ గా కనిపించే డాక్యుమెంట్లు ఉండకపోతే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది.