మీరు ఇంటర్ పూర్తిచేసి, ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త! ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ఇప్పుడు హోమ్ గార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ నైపుణ్యం ఉన్నవారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. రోజుకు ₹710 భత్యంతో, వాలంటరీ సేవ ఆధారంగా ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్త్రీలు, పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి!
ఈ ఉద్యోగం గురించి వివరాలు కింద చూద్దాం|
ముఖ్యమైన వివరాలు
అంశం | వివరాలు |
---|---|
నోటిఫికేషన్ సంఖ్య | 2007/E1/CID-AP/2024-25 |
విడుదల తేదీ | 28-04-2025 |
మొత్తం ఖాళీలు | 28 |
పోస్ట్ పేరు | హోమ్ గార్డ్ (కేటగిరీ-B – టెక్నికల్ & ఇతర ట్రేడ్స్) |
జీతం | రోజుకి ₹710/- (వాలంటరీ సర్వీస్‌గా) |
అర్హతలు
అర్హత | వివరాలు |
---|---|
నివాసం | ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థానిక అభ్యర్థులు మాత్రమే |
వయస్సు | కనీసం: 18 సంవత్సరాలు, గరిష్ఠం: 50 సంవత్సరాలు (01-05-2025 నాటికి) |
లింగం | పురుషులు మరియు మహిళలు ఇద్దరూ అర్హులు |
విద్యా అర్హత | ఇంటర్మీడియట్ (10+2) లేదా సమానమైన అర్హత |
కంప్యూటర్ నైపుణ్యం | MS Office, ఇంటర్నెట్, టైపింగ్, డ్రాఫ్టింగ్ వంటివి |
డ్రైవింగ్ లైసెన్స్ | చెల్లుబాటు అయ్యే LMV లేదా HMV లైసెన్స్ తప్పనిసరి |
ఎత్తు | పురుషులు: కనీసం 160 సెం.మీ., మహిళలు: 150 సెం.మీ. (ST మహిళలకు 145 సెం.మీ.) |
ఆరోగ్యం | శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి |
పాత్ర | మంచి నడవడి ఉండాలి – CID వెరిఫికేషన్ చేస్తారు |
ఎంపిక ప్రక్రియ
- అప్లికేషన్ స్క్రూటినీ – అర్హతల ఆధారంగా దరఖాస్తులను పరిశీలిస్తారు
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ – ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించాలి
- ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) – ఎత్తు అర్హత ఉండాలి
- స్కిల్ టెస్ట్
- కంప్యూటర్ నైపుణ్య పరీక్ష
- డ్రైవింగ్ టెస్ట్ (ప్రాక్టికల్)
డ్యూటీ చేసే ప్రాంతాలు
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను క్రింది ప్రాంతాల్లో పోస్టింగ్ చేస్తారు:
- CID హెడ్‌క్వార్టర్స్, మంగళగిరి
- విశాఖపట్నం
- రాజమండ్రి
- విజయవాడ
- గుంటూరు
- నెల్లూరు
- తిరుపతి
- కర్నూలు
👉AP CID Home Guard Notification 2025 PDF
అప్లికేషన్ ఎలా పంపాలి?
అంశం | వివరాలు |
---|---|
అప్లికేషన్ ప్రారంభం | 01-05-2025 |
చివరి తేది | 15-05-2025 (మధ్యరాత్రి 11:59 వరకు) |
పంపే విధానం | మీరు స్వయంగా ఇవ్వాలి లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి |
చిరునామా | The Director General of Police, CID, AP Police Headquarters, MANGALAGIRI – 522503 |
అప్లికేషన్ ఫారం | https://cid.appolice.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు |
ప్రాధాన్యత కలిగే అర్హతలు
కింది అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు:
- BCA / B.Sc. (Computers) / MCA / B.Tech (Computers)
- ఇతర IT సంబంధిత అర్హతలు
అవసరమైన డాక్యుమెంట్లు (సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు)
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
- 10వ తరగతి సర్టిఫికేట్
- ఇంటర్ సర్టిఫికేట్
- ఇతర విద్యా సర్టిఫికేట్లు (ఉంటే)
- నివాస సర్టిఫికేట్
- కుల సర్టిఫికేట్
- డ్రైవింగ్ లైసెన్స్
- కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్
- 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
- ఇతర టెక్నికల్ సర్టిఫికేట్లు (ఉంటే)
Also Read: APCOS Recruitment in AP
ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీ |
---|---|
అప్లికేషన్ ప్రారంభం | 01-05-2025 |
చివరి తేది | 15-05-2025 (11:59 PM) |
PMT/స్కిల్ టెస్టుల తేదీలు | త్వరలో ప్రకటించబడతాయి – వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ చూడగలరు |
సాధారణంగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఈ హోమ్ గార్డ్ ఉద్యోగం శాశ్వతమా?
కాదు, ఇది వాలంటరీ సర్వీస్. శాశ్వత ప్రభుత్వ ఉద్యోగంగా పరిగణించరు.
2. ఇంటర్ పూర్తి చేసినవారికి మాత్రమే అర్హత ఉందా?
అవును, కనీసం ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత అవసరం.
3. కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేయవచ్చా?
కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి. గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ ఉంటే మంచిది.
4. మహిళలకు ఎత్తు అర్హతలో మినహాయింపు ఉందా?
అవును, ST మహిళలకు కనీస ఎత్తు 145 సెం.మీ.
5. అప్లికేషన్ ఫారం ఎక్కడ దొరుకుతుంది?
CID అధికారిక వెబ్‌సైట్ https://cid.appolice.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.