ANGRAU Recruitment 2025 ఏపీలో ఉన్న ఆచార్య ఎన్జీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇందులో డ్రోన్ పలట్ కమ్ ట్రైనర్, ప్రోగ్రామింగ్ ఇంజనీర్, డ్రోన్ ట్రైనర్ పోస్టులు వున్నాయి. మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకి అర్హులు. ఈనెల 14వ తేదీ దరఖాస్తుకు ఆఖరి రోజు. ఈ ఉద్యోగాల గురుంచి పూర్తి వివరాలు కింద ఇచ్చాము.
ఆంధ్రప్రదేశ్ సెన్సార్స్ అండ్ స్మార్ట్ అప్లికేషన్స్ రీసెర్చ్ ఇన్ అగ్రికల్చర్ (APSARA) ప్రాజెక్ట్ కోసం కొన్ని తాత్కాలిక ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు వ్యవసాయ పరిశోధన, డ్రోన్ ట్రైనింగ్, మరియు సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాలకు అవసరం. ఎంపికైన అభ్యర్థులు APSARAలో జరిగే డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు, ప్రాజెక్ట్‌లు, మరియు ఇతర సాంకేతిక కార్యక్రమాలలో పనిచేయాల్సి ఉంటుంది.
ANGRAU Recruitment 2025 అర్హతలు మరియు అనుభవం వివరంగా
డ్రోన్ పైలట్ కమ్ ట్రైనర్
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రోన్ పైలట్ కమ్ ట్రైనర్ ఉద్యోగానికి 4 ఖాళీలు ఉన్నాయి. దీనికి డిప్లొమా (వ్యవసాయం లేదా వ్యవసాయ ఇంజినీరింగ్) లేదా ఏదైనా B.Tech అర్హత అవసరం. అభ్యర్థికి DGCA RPTO ట్రైనింగ్ అనుభవం ఉండాలి లేదా ANGRAU-ADITI సర్టిఫికేషన్ లేదా APSARA ఇంటర్న్షిప్ చేసిన వారికీ ప్రాధాన్యం ఉంటుంది. అదనంగా, 4 వీలర్ డ్రైవింగ్ అనుభవం కూడా ఉంటే మంచిది.
ప్రోగ్రామింగ్ ఇంజినీర్ కమ్ RPTO అడ్మిన్
ప్రోగ్రామింగ్ ఇంజినీర్ కమ్ RPTO అడ్మిన్ ఉద్యోగానికి 1 ఖాళీ ఉంది. దీనికి B.Tech (CSE) లేదా ఏదైనా B.Tech చేసి ఉండాలి. అభ్యర్థికి వ్యవసాయ డ్రోన్ రంగంలో అనుభవం ఉండాలి. డేటాబేస్ మేనేజ్‌మెంట్, AI/ML & Python ప్రోగ్రామింగ్ లో అనుభవం ఉంటే మేలు. అభ్యర్థి డ్రోన్ పైలటింగ్ నేర్చుకోవడం కూడా తప్పనిసరి.
IoT, AI & ML & 3D ఇంజినీర్ కమ్ డ్రోన్ ట్రైనర్
IoT, AI & ML & 3D ఇంజినీర్ కమ్ డ్రోన్ ట్రైనర్ ఉద్యోగానికి 1 ఖాళీ ఉంది. దీనికి B.Tech (ECE/Mechanical) అర్హత కావాలి. అభ్యర్థికి IoT సెన్సార్ ఇంటిగ్రేషన్, Microprocessor ప్రోగ్రామింగ్ (Arduino, 3D ప్రింటింగ్) వంటి నైపుణ్యాలు ఉండాలి. వ్యవసాయానికి అవసరమైన IoT డివైస్‌లను అభివృద్ధి చేయడానికి ఈ ఉద్యోగం చాలా ముఖ్యమైనది.
ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి. ఎంపికైన అభ్యర్థులకు మొత్తం 11 నెలల వరకు మాత్రమే ఉద్యోగం ఉంటుంది. అయితే, అభ్యర్థి పనితీరు మరియు ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి ఉద్యోగ కాలం ముందే ముగిసే అవకాశం కూడా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి అవసరమైనప్పుడు మాత్రమే ఆఫర్ లెటర్ ఇస్తారు.
ANGRAU Recruitment 2025 దరఖాస్తు విధానం
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఒకే PDF ఫైల్ లో తమ సంతకం చేసిన బయోడేటా (ఫోటోతో), విద్యార్హతల సర్టిఫికేట్లు, మరియు అనుభవ పత్రాలు జతచేసి recruitment.angrauapsara@gmail.com ఈ మెయిల్‌కి పంపాలి. అయోమయంగా లేదా రెండు విభిన్న మెయిల్స్ పంపిన అభ్యర్థుల అప్లికేషన్లు పరిగణనలోకి తీసుకోరు.
ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు 12 గంటల ముందు లింక్ పంపబడుతుంది. అభ్యర్థులు కంప్యూటర్ లేదా లాప్‌టాప్ ద్వారా ఇంటర్వ్యూకి హాజరుకావాలి. మొబైల్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించరు. ఎంపిక పూర్తిగా APSARA ప్రాజెక్ట్‌కు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగా జరుగుతుంది.
ANGRAU Recruitment 2025 అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో ఫీజు గురించి ఎక్కడ చర్చించలేదు, కావున ఎటువంటి ఫీజు లేదు.
ANGRAU Recruitment 2025 వయస్సు
ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో వయస్సు గురించి కూడా ఎక్కడ చర్చించలేదు, కావున ఈ ఉద్యోగాలకు వయస్సు తో ఏమి సంబందం లేదు.
ANGRAU Recruitment 2025 ఎంపిక విధానం
అభ్యర్థులు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా మాత్రమే హాజరు కావాలి, స్మార్ట్‌ఫోన్ అనుమతి లేదు. ఇంటర్నెట్ సమస్యలు వచ్చినట్లయితే ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు, కాబట్టి అభ్యర్థులు తమ ఫోన్ యాక్టివ్‌గా ఉంచాలి. ఏపీఎస్ఏఆర్‌ఏ (APSARA) ప్రాజెక్ట్‌కు డ్రోన్స్‌పై ప్రత్యేక నైపుణ్యం అవసరం, అందువల్ల నైపుణ్యాల ఆధారంగా మాత్రమే షార్ట్‌లిస్టింగ్ మరియు సెలక్షన్ జరుగుతుంది. ఈ షరతులను అంగీకరించినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
PDF Link: ఇక్కడ క్లిక్ చేయండి
Official Website: ఇక్కడ క్లిక్ చేయండి
ANGRAU Recruitment 2025 ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08 – 02 – 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ : 14 – 02 – 2025
ఇంటర్వ్యూ తేదీ : 17 – 02 – 2025
ఉద్యోగంలో చేరే తేదీ : 20 – 02 – 2025