అమెజాన్ వర్క్ ఫ్రం హోం జాబ్ – రోజూ వీడియోలు చూస్తూ సంపాదించండి|Amazon GO-AI Work From Home Job in Telugu

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మీరు ఇంటి నుండి పనిచేస్తూ, స్థిరమైన ఆదాయాన్ని పొందాలని ఆలోచిస్తున్నారా? చాలా మందికి రోజు మొత్తం స్క్రీన్ ముందు కూర్చునే అలవాటు ఉంటుంది, కానీ, ఆ అలవాటునే పనిగా మార్చుకుంటే ఎలా ఉంటది? అమెజాన్ నుండి ఇప్పుడు వచ్చిన ఈ ఉద్యోగం అలాంటి వారి కోసమే. కంప్యూటర్ మీద వీడియోలు చూసి, వాటిని అర్థం చేసుకుని సరైన సమాచారం ఇవ్వడం ద్వారా మీరు ఈ ఉద్యోగాన్ని చేయవచ్చు. ప్రత్యేకమైన టెక్నికల్ జ్ఞానం లేకుండానే, కేవలం మనిషిగా మంచి దృష్టి, ఓర్పు ఉంటే ఈ పని చేయవచ్చు. ఇంటి నుంచే సురక్షితంగా పని చేయాలనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశం.

ఇది “Associate, ML Data Operations” అనే ఉద్యోగం. ఇది 6 నెలల పాటు కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటుంది. ఈ పని Amazon యొక్క fulfilment centers లో జరిగే పనులను వీడియోల ద్వారా చూసి పరిశీలించడమే.

ఈ ఉద్యోగంలో మీరు fulfilment center లో ఉత్పత్తులు ఎక్కడ పెట్టారో వీడియోలో చూసి, టూల్స్ సహాయంతో దానిని గుర్తించాలి. అంటే, ఒక వస్తువును ఎక్కడ ఉంచారో వీడియోలో చూడాలి, అర్థం చేసుకోవాలి, తరువాత సరైన సమాచారాన్ని టూల్ లో గుర్తించాలి. ఇది fulfilment center లో ఉత్పత్తులు సరిగ్గా ఉంచబడ్డాయా లేదో చెక్ చేయడానికే ఉపయోగపడుతుంది.

మీరు ఈ ఉద్యోగం చేస్తే, రోజుకు చాలా వీడియోలు చూడాలి. ప్రతి వీడియోకి మీరు స్పష్టంగా సమాధానం ఇవ్వాలి. రోజుకు కనీసం 6.8 నుండి 7 గంటల పని చేయాలి. మధ్యలో బ్రేక్స్ తీసుకోవచ్చు. వర్క్ ఫ్రం హోం చేసే వారు టేబుల్, కుర్చీ మరియు సరైన వెలుతురు ఉన్న ప్రత్యేక స్థలం కలిగి ఉండాలి. అక్కడ పని సంబంధిత సమాచారం ఎవ్వరూ చూడకూడదు.

ఈ ఉద్యోగం చాలా దృష్టి అవసరం. కొన్ని వీడియోలు స్పష్టంగా ఉండవు. అలాంటప్పుడు కూడా మీరు వీడియోలో ఏముంది అనేది గుర్తించాలి. అందుకే స్క్రీన్ మీద మీ ఫోకస్ ఎక్కువగా ఉండాలి. రోజూ పని చేయడంలో వేగం మరియు క్వాలిటీ ఉంటేనే ఈ పని నాణ్యంగా జరుగుతుంది.

మీరు వారం లో 5 రోజులు పని చేస్తారు. 2 రోజులు సెలవు. ఈ సెలవులు శనివారం, ఆదివారం కావడం కావచ్చు లేదా ఉండకపోవచ్చు. మీరు రాత్రిపూట పని చేస్తే, అమెజాన్ నుండి అదనంగా షిఫ్ట్ భత్యం కూడా లభిస్తుంది. ఒక్కో రోజు మీరు 9 గంటల పాటు పని చేస్తారు. మధ్యలో బ్రేక్స్ ఉంటాయి. షిఫ్ట్‌లు మూడు నెలలకొకసారి మారవచ్చు.

ఈ పని చాలా అవసరమైన పని. fulfilment center లో వస్తువులు సరిగ్గా ఉంచబడ్డాయా లేదో మనం చూసి తెలియజేయాలి. మిషన్లకు మన సహాయం వల్ల పనులు మెరుగవుతాయి. అందుకే అమెజాన్ మనల్ని ఈ పని కోసం ఎంపిక చేస్తుంది.

అర్హత

ఈ ఉద్యోగానికి అర్హత ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.

మీరు వీకెండ్‌లు, సెలవులు, రాత్రిపూట కూడా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు వర్చువల్ మీటింగ్ లో ఉండగానే ల్యాప్‌టాప్ కెమెరా ఆన్ చేయాలి. వర్క్ ఫ్రం హోం చేస్తున్నా, అవసరమైతే కొన్ని రోజులు ఆఫీసుకు రావాలి.

ఈ ఉద్యోగం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఆంధ్రప్రదేశ్ వర్చువల్ లొకేషన్లకు అందుబాటులో ఉంది. అమెజాన్ అన్ని ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పిస్తుంది. మీరు దివ్యాంగులైతే, అవసరమైన సదుపాయాలు కూడా అందిస్తారు.

ఇలాంటివే కొన్ని సంబంధిత ఉద్యోగాలు కూడా అమెజాన్ లో ఉన్నాయి. మీరు అమెజాన్ జాబ్ వెబ్‌సైట్ లో చూడవచ్చు.

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, వయస్సు 18+ ఉండాలి. Both Males and Females ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

👉అప్లికేషన్ లింక్ – ఇక్కడ క్లిక్ చేయండి

ప్రశ్నలు మరియు సమాధానాలు (FAQs):

  1. ఈ ఉద్యోగం ఏంటి?
    ఇది fulfilment center లో జఱిగిన పనుల వీడియోలు చూడడం, వాటిని అర్థం చేసుకుని సరైన టూల్ లో గుర్తించడం.
  2. ఇంటినుండి పని చేయచ్చా?
    అవును, కొన్ని ప్రాంతాల్లో వర్చువల్ వర్క్ అందుబాటులో ఉంది.
  3. పనిచేసే సమయం ఎంత?
    రోజుకు 9 గంటలు, వారానికి 5 రోజులు పని. షిఫ్ట్‌లు మారుతూ ఉంటాయి.
  4. అర్హతలు ఏమిటి?
    కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. సుదీర్ఘంగా స్క్రీన్ చూస్తూ ఫోకస్ చేయగలగాలి.
  5. నైట్ షిఫ్ట్ చేస్తే అదనపు భత్యం వస్తుందా?
    అవును, అమెజాన్ నిబంధనల ప్రకారం నైట్ షిఫ్ట్ అలవెన్స్ లభిస్తుంది.

ఇది మీకు సరిపోయే ఉద్యోగం అనిపిస్తే, వెంటనే అమెజాన్ జాబ్ పోర్టల్ లో అప్లై చేయండి.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment