ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ లేదా ఇంజినీరింగ్ చదివి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కలలు కంటుంటే, ఇది మీ కోసం వచ్చిన ఛాన్స్! ఈ జాబ్ కోసం ఏం చదివుండాలి, జీతం ఎంత ఉంటుంది, ఎలా సెలెక్ట్ చేస్తారు, అప్లై ఎలా చేసుకోవాలి అనే ప్రతి విషయం ఇప్పుడు తెలుసుకుందాం… రెడీనా?
అర్హతలు
- బి.ఎస్.సి (ఫిజిక్స్, మ్యాథ్) లేదా ఇంజినీరింగ్ డిగ్రీ అవసరం
- 10వ లేదా 12వ తరగతిలో ఇంగ్లీష్ తప్పనిసరిగా చదివి ఉండాలి
వయో పరిమితి (24.05.2025 నాటికి)
కేటగిరీ | గరిష్ట వయస్సు |
---|---|
జనరల్ | 27 సంవత్సరాలు |
ఎస్సీ/ఎస్టీ | 32 సంవత్సరాలు |
ఓబీసీ (NCL) | 30 సంవత్సరాలు |
వికలాంగులు | 37 సంవత్సరాలు |
ఖాళీలు మరియు రిజర్వేషన్
కేటగిరీ | ఖాళీలు |
---|---|
జనరల్ (UR) | 125 |
ఓబీసీ (NCL) | 72 |
ఎస్సీ | 55 |
ఎస్టీ | 27 |
EWS | 30 |
మొత్తం | 309 |
జీతం మరియు ప్రయోజనాలు
వివరాలు | సమాచారం |
---|---|
జీతం (IDA స్కేల్) | ₹40,000 – ₹1,40,000 |
వార్షిక CTC | సుమారు ₹13 లక్షలు |
ఇతర బెనిఫిట్స్ | DA, HRA, మెడికల్, CPF, గ్రాట్యుటీ, ఇతర అలవెన్సులు |
ఎంపిక విధానం
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) – నెగటివ్ మార్కింగ్ లేదు
- వాయిస్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సైకలాజికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ చెక్
- CBT మెరిట్ ఆధారంగా ఫైనల్ ఎంపిక జరుగుతుంది
ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీ |
---|---|
దరఖాస్తు ప్రారంభం | 25 ఏప్రిల్ 2025 |
చివరి తేదీ | 24 మే 2025 |
CBT పరీక్ష తేదీ | త్వరలో వెల్లడవుతుంది |
👉AAI Junior Executive Jobs 2025 Notification PDF
అప్లికేషన్ వివరాలు
- అధికారిక వెబ్‌సైట్: www.aai.aero
- అప్లికేషన్ ఫీజు: ₹1000/-
- SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు
- ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి
- మోబైల్ నంబర్, ఈమెయిల్ యాక్టివ్‌గా ఉంచాలి
👉AAI Junior Executive Jobs 2025 Apply Link
బాండ్ & శిక్షణ
- ఎంపికైనవారు శిక్షణ పూర్తిచేయాలి
- శిక్షణ అనంతరం 3 సంవత్సరాలు AAI లో పని చేయాలనే నిబంధనతో ₹7 లక్షల బాండ్‌పై సంతకం చేయాలి
AAI Recruitment 2025 FAQs
1. ఎవరెవరూ అప్లై చేయవచ్చు?
బి.ఎస్.సి (ఫిజిక్స్ & మ్యాథ్) లేదా ఇంజినీరింగ్ చేసినవారు అప్లై చేయవచ్చు.
2. CBT పరీక్షకు నెగటివ్ మార్కింగ్ ఉందా?
లేదు, ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉండదు.
3. జీతం ఎంత ఉంటుంది?
సంవత్సరానికి సుమారు ₹13 లక్షల CTC.
4. దరఖాస్తు ఎలా చేయాలి?
www.aai.aero వెబ్‌సైట్‌లో “Careers” సెక్షన్‌కి వెళ్లి అప్లై చేయాలి.
5. ఎంపిక అయ్యాక ఏదైనా బాండ్ ఉంటుందా?
అవును, ఎంపికైన అభ్యర్థులు ₹7 లక్షల బాండ్‌పై సంతకం చేయాలి.