SGPGI Lucknow Nursing Officer Recruitment 2025:1200 ఖాళీలు-స్టార్టింగ్ శాలరీ ₹44,900!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

లక్నోలో ఉన్న ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ అయిన SGPGI (సంజయ్ గాంధీ పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తాజాగా నర్సింగ్ ఆఫీసర్ (Sister Grade-II) పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్‌ ద్వారా మొత్తం 1,200 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. జీతం కూడా చాలా బాగుంటుంది – ₹44,900 నుండి మొదలై రూ.1,42,400 వరకు ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు – కేవలం CBT ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. B. Sc నర్సింగ్ పూర్తిచేసి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నవారు, ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కింద ఉన్నాయి.

SGPGI Lucknow Nursing Officer Recruitment 2025

ఖాళీల వివరాలు:

పోస్టు పేరునర్సింగ్ ఆఫీసర్ (Sister Grade-II)
మొత్తం ఖాళీలు1,200
గ్రూప్గ్రూప్ ‘B’
పే లెవల్లెవల్ 7 (7వ సిపిసీ ప్రకారం)

కేటగిరీ వారీగా ఖాళీలు:

కేటగిరీఖాళీలు
సాధారణ (UR)480
ఓబీసీ (OBC)324
ఎస్సీ (SC)253
ఎస్టీ (ST)24
ఈడబ్ల్యూఎస్ (EWS)119

SGPGI Lucknow Nursing Officer Recruitment 2025

అర్హతలు (ఎడ్యుకేషన్ + అనుభవం):

  • బీఈసి (హానర్స్) నర్సింగ్ / పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా
  • GNM పూర్తిచేసినవారు – మినిమం 50 పడకలున్న హాస్పిటల్‌లో 2 ఏళ్ల అనుభవం ఉండాలి
  • ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి

వయస్సు పరిమితి: (01-01-2025నాటికి)

  • కనీసం: 18 ఏళ్లు
  • గరిష్ఠం: 40 ఏళ్లు
  • రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది

SGPGI Lucknow Nursing Officer Recruitment 2025

ఎంపిక విధానం & ఎగ్జామ్ విధానం:

  • ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
  • CBT ఎగ్జామ్ ఫార్మాట్:
  • మొత్తం ప్రశ్నలు: 100 (ఆబ్జెక్టివ్ MCQ)
  • సమయం: 2 గంటలు
  • నెగెటివ్ మార్కింగ్: తప్పు సమాధానానికి -0.33 మార్కులు

సిలబస్ విభజన:

విభాగంమార్కులు
నర్సింగ్ సబ్జెక్టు60
జనరల్ ఇంగ్లిష్10
రీజనింగ్10
జనరల్ నాలెడ్జ్ (GK)10
అప్టిట్యూడ్10

క్వాలిఫయింగ్ మార్కులు:

  • UR/OBC/EWS: కనీసం 50%
  • SC/ST: కనీసం 45%

అప్లికేషన్ ప్రక్రియ:

  • మోడ్: ఆన్‌లైన్
  • ఆఫిషియల్ వెబ్‌సైట్: sgpgims.org.in

అప్లికేషన్ తేదీలు:

ప్రారంభ తేదీముగింపు తేదీ
12 జూన్ 202530 జూన్ 2025

SGPGI Lucknow Nursing Officer Recruitment 2025

అప్లికేషన్ ఫీజు:

కేటగిరీఫీజు
UR/OBC/EWS₹1,180
SC/ST₹708

SGPGI Lucknow Nursing Officer Recruitment 2025

జీతం మరియు ప్రయోజనాలు:

  • జీతం: ₹44,900 – ₹1,42,400 (లెవల్ 7)
  • జీతంతో పాటు DA, హౌస్ అలోవెన్స్, మెడికల్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు ఉంటాయి
  • పెన్షన్, ప్రోమోషన్, క్యాంపస్ లో హౌసింగ్ సదుపాయం లభించవచ్చు
  • ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ లో నర్సింగ్ కెరీర్‌కు మంచి ఆరంభం

ముఖ్యాంశాలు:

  • ఎంపిక పూర్తిగా CBT ఆధారంగా – ఇంటర్వ్యూ లేదు
  • GNM + అనుభవం ఉన్నవారికి కూడా అవకాశం
  • ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే నర్సింగ్ అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశం

SGPGI Lucknow Nursing Officer Recruitment 2025 Notification PDF

అభ్యర్థులు ఇప్పుడే చేయవలసినవి:

  • ఆఫిషియల్ నోటిఫికేషన్ PDF ని పూర్తిగా చదవండి
  • దరఖాస్తు చేసే ముందు, మీకు కావాల్సిన అర్హతలు (విద్య, వయస్సు, అనుభవం) అన్ని ఉన్నాయో లేదో ఒకసారి చేసుకోండి.
  • అవసరమైన డాక్యుమెంట్లు (నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, ID ప్రూఫ్, సర్టిఫికెట్లు) సిద్ధంగా పెట్టుకోండి
  • చివరి తేదీకి ముందే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి
  • నర్సింగ్ సబ్జెక్ట్ మీద ఫోకస్‌తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి

SGPGI Lucknow Nursing Officer Recruitment 2025

అప్లై లింక్:

ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️RRB Technician జాబ్స్ – 10th, ITI, Diploma చేసినవారి కోసం!

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):

1) GNM చేసిన వాళ్లకు అవకాశం ఉందా?
అవును, GNM చేసినవారు కూడా అప్లై చేయొచ్చు. కానీ 50 పడకలున్న హాస్పిటల్‌లో 2 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

2) ఎగ్జామ్ లో నెగెటివ్ మార్కింగ్ ఉందా?
అవును. ఒక్కో తప్పు సమాధానానికి 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.

3) ఎంపికకు ఇంటర్వ్యూ ఉండదా?
ఎంపిక పూర్తిగా CBT ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉండదు.

4) ఫీజు చెల్లింపు ఆన్‌లైన్లో చేయాలా?
అవును. అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్లోనే చెల్లించాలి.

5) ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది?
ఎగ్జామ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ అప్లికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక త్వరలోనే ప్రకటిస్తారు.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment